ప్లాస్టిక్ సర్జీల గురించి బాలివుడ్ లో ప్రస్తావన వస్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది రాఖీ సావంత్. రాఖీ సావంత్ ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలతో తన శరీరాన్ని ఓ ప్రయోగశాలగా మార్చుకున్న నటి. లైపో సక్షన్ నుంచి బ్రెస్ట్ ఇంప్లాంట్ వరకు ఆమె చేయని ప్రయత్నం లేదు. హాట్ హాట్ గా కనిపించాలని, అవకాశాలను సొంతం చేసుకోవాలన్న ఆరాటం ఆమెతో అలాంటి పనులను చేయించింది. ఇలాంటి సర్జరీ ప్రయత్నాలు బెడిసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తన జీవితంలో భయంకరమైన ఒక సందర్భాన్ని ఆమె ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. ‘‘నాకు 15-16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బ్రెస్ట్ సర్జరీ (వక్షోజాలకు సంబంధించిన శస్త్రచికిత్స) చేయించుకున్నాను. అది నన్ను ఎంతో భయపెట్టింది. నేను బాలిక కావడంతో వక్షోజాల ఆకృతి కనిపించే విధంగా లేదు. అదే సమయంలో బాలీవుడ్ లో చోటు సంపాదించాలని నాకుంది. ఆ సమయంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లు సైతం సర్జరీలు చేయించుకుంటున్నారు. బాలీవుడ్ లోకి రావాలనుకుంటే ముఖం, శరీరం చక్కని ఆకృతిలో ఉండాలని అందరూ నాకు చెప్పారు. ఆ సమయంలో నేను సంపూర్ణ ఆకృతిలో లేను. అందుకే ఆపరేషన్ సాయంతో కూల్ అమ్మాయి నుంచి హాట్ అమ్మాయిగా మారాను’’అని రాఖీ సావంత్ చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa