ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 03:27 PM

ప్రభాస్ తో తనకు విభేదాలున్నాయన్న దానిపై హీరోయిన్ పూజా హేగ్డే స్పందించారు. ప్రభాస్ లాంటి మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి అని ఆమె ఎదురు ప్రశ్నించచారరు. ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' రూపొందింది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగు సమయంలోనే ప్రభాస్ - పూజ హెగ్డే మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ఒక టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కలిసి పోజులు ఇవ్వడానికి కూడా ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి.  తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకి సమాధానంగా పూజ హెగ్డే స్పందిస్తూ .. "ప్రభాస్ గొప్ప మనసున్న మనిషి .. షూటింగు సమయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. తన ఇంటి నుంచే ప్రతిరోజూ భోజనం తెప్పించేవారు. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి? .. అదంతా పుకారే. నేనే కాదు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు" అంటూ చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa