సినీ పరిశ్రమలో విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో జంట విడిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత బాలా తన భార్య ముద్దుమలర్‌తో విడిపోయారు. ఈ వార్త తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. నాలుగేళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ జంట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే వీరి విడిపోవడానికి గత కారణాలు తెలియరాలేదు. ఈ జంట 2004లో మధురైలో వివాహం చేసుకున్నారు. వీరికి ప్రార్థన అనే కుమార్తె ఉంది. నేటితో 17 ఏళ్ల దాంపత్య జీవితానికి తెరపడింది. మరోవైపు బాలయ్య తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేయబోతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa