ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదలకు ముందే దుమ్ము లేపుతున్న పునీత్ కుమార్ చివరి చిత్రం జేమ్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 03:10 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ శివరాజ్ కుమార్  గతేడాది అక్టోబర్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన చివరి చిత్రం జేమ్స్ తొంభై శాతం షూటింగు పూర్తి చేసుకున్న తర్వాత హఠాత్తుగా పునీత్ మరణించటంతో మిగిలిన పది శాతాన్ని ఎలాగొలా కంప్లీట్ చేసారు దర్శక నిర్మాతలు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ జేమ్స్ లో పునీత్ పాత్రకు డబ్బింగ్ చెప్పటం జరిగింది. చేతన్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. 


మార్చి 16న పునీత్ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కర్ణాటకలో ఇదివరకు మరే సినిమాకి సాధ్యం కానీ విధంగా ఒకే రోజు నాలుగువేల షోలు పడబోతున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జేమ్స్ సినిమా కన్నడ నాట కనీవినీ ఎరుగని భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నిర్మాతలు భరోసాగా ఉన్నారు. 


పునీత్ చేసిన ఎన్నో మంచి పనులే ఆయనను కన్నడ ప్రజలు ఇంకా మర్చిపోలేకుండా చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa