బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా నటించిన కొత్త చిత్రం మిషన్ మజ్ను. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మండన్న కధానాయిక. శంతను దర్శకత్వం వహించిన ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు రోనీ స్క్రూవాలా. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జూన్ 10వ తేదీన మజ్ను థియేటర్లలోకి రానున్నాడని అధికారికంగా తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది.
ఈ సినిమాతో బాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుంది రష్మిక. తెలుగు కన్నడ భాషల్లో సంపాదించుకున్న స్టార్ హోదాను బాలీవుడ్లోనూ పొందాలనుకుంటుంది రష్మిక. రష్మిక కెరీర్ బాలీవుడ్లో ఎలా ఉండనుందో మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa