దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిందే.ఇకపోతే ఈ సినిమాకి RC15 అనేది వర్కింగ్ టైటిల్. అంతేకాక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పోతే రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా అవినీతి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత మేరకు పూర్తి కావడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇక ఏదైనా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను " సర్కారోడా" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం వినిపిస్తోంది.
ఇకపోతే రాంచరణ్ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఇక ఆ రెండు విభిన్న గెటప్స్ ఏమిటంటే ఒకటి సివిల్ సర్వీస్ ఆఫీసర్ కాగా మరొకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్.అయితే ఫ్లాష్ బ్యాక్ లో రాంచరణ్ రెట్రో లుక్ లో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. కాగా 'సర్కారోడు' అనే టైటిల్ కథకి యాప్ట్ గా ఉండడంతో చిత్ర యూనిట్ ఆల్మోస్ట్ దీనినే ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ నెల 27న రామ్చరణ్ పుట్టినరోజు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. లేకపోతే రామ్ చరణ్ పుట్టిన రోజు కు గానూ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ లోగో..
ఈ రెండిటిలో ఏదో ఒకటి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ సినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న...ఆయన 50 వ చిత్రం కావడంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శంకర్ సినిమాల్లో ఉండే కళ్ళు చెదిరే పోరాట సన్నివేశాలు, కట్టిపడేసే డ్రామా ఈ చిత్రంలో కూడా ఉండనున్నాయి. అయితే ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఇక ఈ విషయం ఇలా ఉంటే రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ ఆర్ పి ఇక ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa