ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహస్యంగా ప్రియుడితో హీరోయిన్ వివాహం

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 09:44 AM

వివాహ్ సినిమా ద్వారా బాలీవుడ్‌‌లో తన సినీ కెరీర్ మొదలు పెట్టింది హీరోయిన్ అమృతరావు. ఆమె తెలుగులో మహేష్ బాబుకు జోడీగా అతిథి సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా ఆమె చేయలేదు. సినిమాల్లో హిట్‌లు అందుకోకపోయినా ఆమె నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్‌లోనే అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆర్జే అన్మోల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. తాజాగా ఆమె తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అందులో పలు సీక్రెట్‌లను అభిమానులతో పంచుకుంది. తన తల్లిదండ్రులకు తెలియకుండా అన్మోల్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. 2013 నుంచి తమ ఇద్దరికీ ప్రేమ ఉందని, తాను హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న తరుణంలో అన్మోల్ ప్రపోజ్ చేశాడని తెలిపింది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలా వద్ద అనే డైలమాలో పడ్డానని, అన్మోల్ సూచనతో రహస్యంగా పెళ్లి చేసేసుకున్నామని వెల్లడించింది. దీంతో కెరీర్‌కు ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావించామన్నారు. ఈ క్రమంలో 2014లో మే 15న కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకుని, దానిని అధికారికంగా 2016లో ప్రకటించామని వెల్లడించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa