'తిక్క' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది లారిస్సా బోనేసి. మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేసింది. 'తిక్క' లెక్క తప్పడంతో.. ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు రాలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత 'నెక్స్ట్ ఏంటీ ? సినిమాలో నటించింది. అది కూడా ప్లాపే. 2020లో సల్మాన్ ఖాన్ తో కలిసి రియల్ మీ యాడ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'పెంట్ హౌస్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఫోకస్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. వరుస ఫోటో షూట్స్ తో తనలోని హాట్నెస్ ని ప్రేక్షకు లకు పరిచయం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa