ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కారు వారి పాట రెండో పాటపై అప్డేట్ ఇచ్చిన థమన్...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 12:38 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు,కీర్తి సురేష్ జంటగా,డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 


ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ ఐన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట 'కళావతి' కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. యూట్యూబులో అయితే ఈ పాట రికార్డ్సు సృష్టిస్తుంది. 


ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి థమన్ మూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలెట్టేసాడు.


తాజాగా డైరెక్టర్ పరశురామ్, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ తో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి మాస్,సూపర్స్టార్ షైనింగ్ అని కామెంట్ చేసాడు. దీంతో రెండో పాట మాస్ ప్రేక్షకులకు మంచి విందు కానుందని తెలియకనే తెలుస్తుంది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa