ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులులను వీడలేక... ఉక్రెయిన్లోనే ప్రముఖ డాక్టర్...స్పందించిన చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 12:43 PM

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ దేశాన్ని రష్యా చుట్టుముడుతూ దాడులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో చాలామంది సాధారణ ప్రజానీకం మృత్యువాత పడుతున్నారు. ఇతర దేశాల పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్ ను వీడి స్వదేశీ బాట పడుతుంటే, గిరి కుమార్ పాటిల్ మాత్రం తాను పెంచుకుంటున్న పులుల కోసం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈయన ఎప్పటి నుండో ఉక్రెయిన్లో  నివాసం ఉంటున్న ప్రముఖ డాక్టర్. 


లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి చిరుతను పెంచుకుంటాడు. ఆ సినిమా స్పూర్తితో ఒక జాగ్వార్ ను,పాంథర్ ను పెంచుకుంటున్నాడు గిరి కుమార్ పాటిల్.తాను పులులను పెంచుకోవటానికి చిరంజీవి స్ఫూర్తి అని తెలిపారు గిరి కుమార్. దీంతో ముగ్ధుడైన చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 


పులులను వీడలేక యుద్ధ పరిస్థితుల నడుమ ఉండాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న గిరి కుమార్ పాటిల్ కి ఎటువంటి ప్రాణ హాని కలగకూడదని, త్వరలోనే ఉక్రెయిన్లో సాధారణ పరిస్థితులేర్పడాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి ట్వీట్ చేసారు. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa