ప్రభాస్, పూజ హెగ్డే జంటగా, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధేశ్యామ్. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా మార్చి 11 న విడుదలైంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లని రాబడుతుంది.
ఈ తరుణంలో ఈ మూవీ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే... ఇప్పటికే థియేటర్లలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టనుందని. ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందట. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2నఈ మూవీని స్ట్రీమింగ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెలువరిస్తారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa