ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి సినిమాలో యాంకర్ అనసూయ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 02:49 PM

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించి, దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్'కి తెలుగు రీమేక్ గా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  


ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మెగా స్టార్లపై కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చిత్రసీమలో షికారు చేస్తుంది. అదేంటంటే... ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి షాకిచ్చే పాత్రలో బుల్లితెర యాంకర్, నటి అనసూయ నటించనున్నారట. ఒక వ్యక్తి కారణంగా అనుకోకుండా గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మనిచ్చే యువతి పాత్రలో అనసూయ నటిస్తుందని చెప్తున్నారు. అసలింతకీ ఆ పాత్ర వెనుక కధేంటి? చిరంజీవికి ఎందుకు షాకిస్తుంది? తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇటీవల అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమాలో లేడీ విలన్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది అనసూయ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa