బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, పీరియాడికల్ రొమాంటిక్ ఎంటెర్టైనెర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 11న విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ పెదనాన్న,రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ సినిమాని చూసారు. రాధేశ్యామ్ సినిమా చాలా బాగుందంటూ చిత్రబృందాన్ని ప్రశంసించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే బావుణ్ణని, తనకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలనుందని తొలిసారి తన మనసులో మాటను కృష్ణం రాజు బయటపెట్టారు.
ఈ సంవత్సరంలోనైనా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి బాజాలు వినబడతాయేమోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa