టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు తారక్. ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, ఒలీవియా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. ఈ నేపథ్యంలో తారక్ ఫ్యామిలీ తిరుమల శ్రీవారి దర్శనం ప్రాముఖ్యతను సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవస్థానం అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందించారు. అయితే ఇప్పుడు వీరి తిరుమల పర్యటన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో తారక్ కనిపించరు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న అభయ్, భార్గవ్ ల క్యూట్ లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa