టాలీవుడ్ యువ నటుడు, దర్శకుడు విశ్వక్ సేన్ నటించిన కొత్త చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. ఇప్పటి వరకు తన సినిమాలతో మాస్ అండ్ యూత్ ను ఆకట్టుకున్న విశ్వక్ ఈ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువ కానున్నాడు. చింతా విద్యాసాగర్ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4న విడుదల కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పడు ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ఎనౌన్స్ చేసారు. సమ్మర్ ఎంటెర్టైనర్గా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు .
ఈ సినిమాలో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. SVCC డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, ఈదర సుధీర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa