మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరగా తెరపై కనబడింది 2019లో వచ్చిన గడ్డలకొండ గణేష్ లోనే. అప్పటి నుండి ఇప్పటి వరకు వరుణ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఈ మూడేళ్ళని గని, ఎఫ్ 3 సినిమాల కోసం కేటాయించాడు వరుణ్. ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాయి కొర్రపాటి దర్శకత్వంలో కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం గని. వరుణ్ ఈ సినిమాలో బాక్సర్ గా నటిస్తున్నాడు. చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొమోషన్స్ షురూ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది చిత్రబృందం.
గని ట్రైలర్ ను మార్చి 17న ఉదయం పదిన్నరకు రిలీజ్ చేయనున్నట్లు, సోషల్ మీడియా వేదికగా నిర్మాతలు ప్రకటించారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వేసవి కనుక గా ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయటానికి చిత్రబృందం రెడీ అయ్యింది.
ఈ మూవీలో బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు,ఉపేంద్ర,సునీల్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa