ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“ఎత్తర జెండా” సాంగ్ కి 15 మిలియన్స్...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 01:10 PM

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "RRR". ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ చిత్రంలోని "ఎత్తర జెండా" అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో విడుదలైన ఈ పాటకు ప్రస్తుతం విశేష స్పందన లభిస్తోంది. ఈ పాటకు ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియా శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa