ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో అజిత్-నయన్ మూవీ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 01:13 PM

తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్, నాయన తార హీరోహీరోయిన్లుగా  ఒక సినిమా తెరకెక్కనుందని తమిళ చిత్ర వర్గ సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థలో ఈ మూవీ రూపొందనుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయట. 


ఇటీవల హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ వలిమై చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలోనే మరొక  సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు అజిత్. ఆ తరవాత సినిమాగా అజిత్-నయన్ సినిమా ఉండనుందట. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయట. 


గతంలో అజిత్-నయన్ కాంబోలో వచ్చిన విశ్వాసం సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇప్పుడు విగ్నేష్ దర్శకత్వంలో వీరిద్దరూ జత కట్టనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa