ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందు సిట్టింగ్ వేస్తే బాటిల్ లేపాల్సిందే - ఆమిర్ ఖాన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 01:22 PM

మందు సిట్టింగ్ వేస్తే బాటిల్ లేపాల్సిందే...  ఈ మాటలను బాలీవుడ్  ఆమిర్ ఖాన్ స్వయంగా పలికినవి. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ నుండి ఇలాంటి మాటలేమిటి అని ఖంగారు పడకండి. అదంతా ఇదివరకటి సంగతి. ఇంతకుముందు తాను తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్ ఖాళీ చేయనిదే అక్కడి నుండి లేచేవాడు కాదట ఆమిర్. ఎందుకో అది కరెక్ట్ కాదని గ్రహించిన ఆమిర్ తన మీద తాను నియంత్రణ కోల్పోకూడదని ఇక మీదట నుండి తాగకూడదని నిర్ణయించుకున్నాడట. 


ఇటీవల తన 57వ పుట్టినరోజుని జరుపుకున్న ఆమిర్ ఒక ఇంటర్వ్యూ లో పై విషయాలన్నింటిని తెలిపాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... 18ఏళ్లకే చిత్ర పరిశ్రమకు వచ్చిన తాను ఇప్పటివరకు ఎన్నో విషయాలను నేర్చుకున్నాడని, ఈ క్రమంలో అనుకున్న కొన్ని పనులు చేయలేకపోయాడని, తన కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేకపోయాడని, అందుకు బాధగా ఉందని చెప్పుకొచ్చాడు ఆమిర్.  


త్వరలోనే ఆమిర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యువనటుడు నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa