రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో సీతగా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, ఒలీవియా తదితరులు నటిస్తున్నారు. విడుదలకు ముందు నుండే రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం. తాజాగా మరొక రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.
ఒక్క US లోనే 1150 లొకేషన్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారట మేకర్స్. దీంతో US లో ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని అరుదైన ఘనత సాధించింది ఆర్ ఆర్ ఆర్. ఈ నెల 24 నుండే అక్కడ షోస్ మొదలవుతాయి.
కథాకథనాల పరంగానే కాకుండా సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించటం ఖాయమని కొంతమంది సినీ విశ్లేషకుల అంచనా. అయితే ఈ సినిమా 25న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa