ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ నిర్మాత మోసం చేశాడంటూ.... జనసేన పార్టీ కార్యాలయం ఎదుట యువతి నిరసన...

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 03:05 PM

బన్నీ వాసు .... టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, GA 2 పిక్చర్స్ సహా వ్యవస్థాపకుడు. 100% లవ్, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం వంటి విజయవంతమైన సినిమాలకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. సరైనోడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు.
తాజాగా బన్నీ వాసుపై బోయ సునీత అనే మహిళ తనను మోసం చేసాడని మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన కి దిగింది. తనకు గీత ఆర్ట్స్ లో సినిమా అవకాశమిప్పిస్తానని నమ్మించి లైగికంగా తనను వాడుకుని బన్నీ వాసు మోసం చేసాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలిపేందుకు మంగళగిరి వచ్చిన తనను కార్యాలయం లోపలకు వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని బోయ సునీత కోరుకుంటున్నట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa