ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీఎఫ్-2 కి పోటీగా బీస్ట్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 03:28 PM

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన ‘బీస్ట్’ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. నెల్స‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌చార చిత్రాలు, పాట‌లు ఆకట్టుకుంటున్నాయి. అయితే బీస్ట్ విడుదలయ్యే ఆ త‌రువాతి రోజే ‘కేజీఎఫ్ చాప్ట‌ర్‌-2’ విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం సౌత్ టూ నార్త్ ప్ర‌తి ఒక్క‌రు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో బీస్ట్ సినిమాపై కేజీఎఫ్-2 ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
బీస్ట్ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ అందించాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ‘అర‌బిక్ కుత్తూ’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. విజ‌య్ త‌న త‌దుప‌రి సినిమాను వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. దిల్‌రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa