ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రేక్షకులను పలకరించాడు హీరో అఖిల్. ఆ సినిమా అఖిల్ కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ సినిమా సక్సెస్ ను ఏజెంట్ తో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు అఖిల్.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ గూఢచారిగా నటించనున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కథను వక్కంతం వంశీ అందించారు. ఈ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించనున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
2020లో ప్రారంభమైన ఈ సినిమా 2021 డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఈ మూవీ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని మెట్రో ట్రైన్ లో జరుగుతుంది. కర్లీ హెయిర్ తో ఈ షూటింగ్ లో పాల్గొన్న అఖిల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్, టీజర్ వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బర్త్ డే ట్రీట్ ఇవ్వటానికి చిత్రబృందం కూడా సన్నాహాలు చేస్తుందని చిత్రవర్గ సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa