ఇండియా మోస్ట్ ఎవైటెడ్ సినిమాలు ఆర్ ఆర్ ఆర్, కేజిఎఫ్ 2. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ నేడు విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో బాహుబలి తరవాత ఆర్ ఆర్ ఆర్ కూడా చోటు సంపాదించుకుంటుందని నమ్మకంగా ఉన్నారు.
ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన కేజిఎఫ్ 2 విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ 14వతేదీన బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమైంది ఈ సినిమా. ఇటీవల ఈ సినిమా నుండి తుఫాన్ లిరికల్ సాంగ్ విడుదలై 24 గంటల్లోనే యూట్యూబులో 26 మిలియన్ల వ్యూస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక మార్చి 27న జరగబోయే ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ కోసం బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ కరణ్ జోహార్ ను రంగంలోకి దింపనున్నారట కేజిఎఫ్ చిత్రబృందం. మార్చి 27న అత్యంత ఘనంగా జరగబోయే కేజిఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు తెలిపే పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసారు మేకర్స్. దీంతో బాలీవుడ్ అటెన్షన్ గ్రాస్ప్ చేసింది ఈ సినిమా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa