మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ అందాల అరబోత విషయంలో అస్సలు ఆలోచించదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్‌ను పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. అయితే ఈ అమ్మడు కొందరు నెటిజన్స్, తమిళ మీడియాపై ఉన్నట్లుండి కోపం వచ్చింది. అందాల భామకు ఎందుకు కోపం వచ్చింది? అని అనుకుంటున్నారా? ఎందుకంటే.. రీసెంట్‌గా కొందరు మాళవికా మోహనన్ ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారట. దాన్ని కొందరు నెటిజన్స్, తమిళ మీడియాకు చెందిన వారు షేర్ చేయడం జరిగింది. ఇది మాళవికా దృష్టికి వచ్చింది. దీంతో మె మాళవికా మోహనన్ అసహనం వ్యక్తం చేయడమే కాదు.. చీప్ జర్నలిజం అంటూ కామెంట్స్ చేసింది. 2013లో పట్టం పోలే అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది మాళవికా మోహనన్. తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసకుని నిర్ణయాకం అనే మరో మలయాళ సినిమాలో యాక్ట్ చేసింది. తదుపరి నాను మట్టు వరలక్ష్మి అనే కన్నడ సినిమాలో సందడి చేసింది. తమిళంలో రజనీకాంత్ హీరోగా చేసిన పేట, దళపతి విజయ్ హీరోగా చేసిన మాస్టర్ చిత్రాల్లో నటించింది. ధనుష్‌తో చేసిన మారన్ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇక బాలీవుడ్‌లో బియాండ్ ది క్లౌడ్స్, యుద్ర సినిమాల్లో నటించింది. ఎందుకనో మాళవికా మోహనన్ తెలుగు సినిమాల్లో నటించడం లేదు. అంటే తెలుగు నిర్మాతలు మాళవిక మోహనన్‌ను పట్టించుకోవడం లేదా.. లేక పాన్ ఇండియా రేంజ్‌కి చేరినా కూడా తెలుగు సినిమాలు మాళవికా మోహనన్ కంటికి ఆనడం లేదో తెలియడం లేదు. ఆ మధ్య ఓసారి రవితేజ సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను స్ట్రయిట్ మూవీతో ఎప్పుడు మెప్పిస్తుందో కాలమే నిర్ణయించాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa