టాలీవుడ్‌కి చెందిన టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. అగ్ర హీరోల సినిమాల్లో చాలా మందికి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తుంటారు. హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టు డాన్స్ మూమెంట్స్‌ను కంపోజ్ చేయడం తెలిసిన కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరని అందరూ అనుకుంటుంటారు. జానీ మాస్టర్‌తో వర్క్ చేసిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. మాస్టర్‌కు ఖరీదైన బహుమతిని ఇచ్చారు. ఇంతకీ కిచ్చా సుదీప్ నుంచి జానీ మాస్టర్ అందుకున్న గిఫ్ట్ ఏంటో తెలుసా! ఖరీదైన కారు. ఈ ఖరీదైన థార్ కారుతో పాటు కిచ్చా సుదీప్‌తో కలిసి ఉన్న ఫొటోను జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కిచ్చా సుదీప్‌కి ఆయన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా జానీ మాస్టర్ థాంక్స్ చెప్పారు. రీసెంట్ టైమ్‌లోనూ జానీ మాస్టర్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన మ్యూజిక్ వీడియో ‘పయని’కి కొరియోగ్రఫీ అందించారు. ఈ సాంగ్‌లో జానీ మాస్టర్‌తో పాటు శ్రుష్టి వర్మ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆయనకు దర్శకుడు కావాలనే కోరిక చాలా బలంగా ఉంది. పలు సందర్భాల్లో ఆయన తన మనసులో మాటను తెలియజేశారు. అయితే ఆయన మెగాఫోన్ ఎప్పుడు పట్టబోతున్నారనేది కాలమే నిర్ణయించాలి. ఒకప్పుడు డాన్స్ షోలో పాల్గొన్న జానీ మాస్టర్‌ను డాన్స్ రాదంటూ బయటకు పంపేస్తే.. ఆయన దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని టాప్ కొరియోగ్రాఫర్‌గా మారారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్, కోలీవుడ్‌లో విజయ్ ఇలా టాప్ స్టార్స్ అందరితోనూ జానీ మాస్టర్ వర్క్ చేశారు. రీసెంట్‌గానూ విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బీస్ట్. ఈ చిత్రంలో అరబిక్ కుత్తు సాంగ్ కూడా జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa