ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమౌళిపై సుకుమార్ ప్రశంసల వర్షం

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 10:38 PM

సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. దర్శకధీరుడు రాజమౌళి విజన్ చూసి అందరూ అబ్బురపడిపోతోన్నారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు అందరూ ముగ్దులైపోతోన్నారు. సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు ఆర్ఆర్ఆర్ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. దాదాపు హీరోలందరూ కూడా సినిమా గురించి మాట్లాడేస్తున్నారు. దర్శకులు కూడా ట్వీట్లు పెడుతున్నారు. దర్శకులు, రచయితలు సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ రాజమౌళిని కీర్తిస్తున్నారు. తాజాగా రాజమౌళిపై తన స్టైల్లో కవిత్వాన్ని రాస్తూ సుకుమార్ ప్రేమను కురిపించాడు. సుకుమార్ వాడే పదాలు, వాటి అల్లిక, భావాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో సుకుమార్ అంటే చాలా ఇష్టమని, ఆయన తీసే విధానం ఎంతో నచ్చుతుందని రాజమౌళి బహిరంగంగా చెబుతుంటాడు. ఇక రాజమౌళి అంటే ఎంతో ఇష్టమని సుకుమార్ చెబుతుంటాడు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సుకుమార్ ఓ పోస్ట్ చేశాడు. ఇందులో రాజమౌళి మీద ఎవ్వరూ ఊహించని విధంగా ప్రశంసలు కురిపించాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa