ప్రస్తుతం టాలీవుడ్లో రీమేక్ ట్రెండ్ నడుస్తుంది. అది కూడా ఎక్కువ మలయాళ చిత్రాలే రీమేక్ అవుతున్నాయి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనం కోషియం కు రీమేక్ కాగా, మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గా రాబోతున్న గాడ్ ఫాదర్ కూడా మరో మలయాళ చిత్రం లూసిఫర్ కు తెలుగు రీమేక్ అని తెలిసిందే. బ్రోడాడీ అనే మలయాళ సినిమాని కూడా చిరు రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని చిత్రవర్గ సమాచారం.
తాజాగా మరో మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'హృదయం' ను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేసారు కరణ్. యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'హృదయం'. ఒక యువకుడి జీవిత ప్రయాణాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు వినీత్ శ్రీనివాసన్. ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందించేందుకు గానూ హక్కుల్ని చేజిక్కించుకున్నారు కరణ్. అయితే ఈ సినిమాకు డైరెక్టర్గా మాతృక దర్శకుడు వినీత్ ను ఎంచుకుంటారా? లేక మరో దర్శకుణ్ణి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్ర నిర్మాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కరణ్ తాజాగా హృదయం చిత్ర నిర్మాణంతో సౌత్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa