మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి... మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి... రాజమౌళి సర్...మీకూ మాకూ ఒకటే తేడా... ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేం చూడగలమంతే... ఆర్ ఆర్ ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళినుద్దేశించి టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలివి. దర్శకుడు అన్న పదానికి స్టార్డం తీసుకొచ్చిన అతికొద్దిమందిలో రాజమౌళి ఒకరు. చిత్రసీమలో ఒకసారి అద్భుతం సృష్టించడమే కష్టమనుకుంటే, రాజమౌళి నుండి బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి వరస అద్భుతాలు రావడం నిజంగా చాలా... చాలా అంటే చాలా... గ్రేట్ అని సామాన్య ప్రేక్షకుడితో పాటూ సినీదిగ్గజాలు అనుకుంటున్న మాటలివి. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇద్దరు ఒకే ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలను చాలా బ్యాలెన్స్డ్ గా, అద్భుతమైన ఎమోషన్ తో చూపించిన తీరు ప్రశంసనీయం. ప్రపంచ సినీ చరిత్రలో బాహుబలి తో పాటూ ఆర్ ఆర్ ఆర్ కూడా చోటు దక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్క సినిమాతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్న రాజమౌళిని అందుకోవాలంటే పరిగెత్తడం కాదు కదా... జెట్ స్పీడులో వెళ్లినా సాధ్యం కాదు. ఆయన స్థాయి వేరు అంటూ తోటి దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు సుకుమార్. ఈ మేరకు ఒక ప్రత్యకమైన నోట్ ను ట్విట్టర్లో షేర్ చేసారు సుకుమార్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa