దేశదృష్టిని మొత్తం ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. తొంభైలలో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న అవమానాలు, వారిపై జరిగిన అకృత్యాలు, వారి ఊచకోత నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. దేశప్రజలకు తెలియని కాశ్మీర్ అంతర్గత విషయాలను ఈ సినిమాతో బహిర్గతం చేశారు వివేక్. దేశ ప్రధాని నరేంద్రమోడీ మెప్పును సైతం వివేక్ పొందడం విశేషం. అయితే తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివేక్ మాట్లాడుతూ... స్వతహాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన వాడిని నేను. కానీ ఈ విషయం నేను బయటెక్కడా చెప్పుకోను. ఎందుకంటే భోపాలి అంటే స్వలింగసంపర్కులని అర్ధం. భోపాలి వారిలో నవాబుల ప్రవర్తన కూడా కనిపిస్తుంటుంది. అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ధూమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భోపాలి ప్రజలు వివేక్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. ఆయనకు స్వలింగ సంపర్కం చేసుకునే అలవాటుందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదని వివేక్ కు కౌంటరిచ్చారు. ఈ మేరకు ఒక వీడియో ను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa