టాలీవుడ్ యువనటుడు నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరొయిన్గా నటిస్తుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఒక ప్రత్యేక పాత్రలో కేథరిన్ థెరిసా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి నితిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్రబృందం. అలెర్ట్.. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి ఫస్ట్ ఛార్జ్ రెడీ... అని పోస్టర్ కు కాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ రెడ్డి అనే పవర్ఫుల్ కలెక్టర్ గా నటిస్తున్నాడని అర్ధమవుతుంది. పోస్టర్లో నితిన్ మాస్ లుక్లో అదరగొట్టేసాడు. నితిన్ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa