ఇటీవల విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1990లలో కాశ్మీర్‌లో జరిగిన హిందూ పండిట్ల ఊచకోత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన స్వస్థలం భోపాల్ స్వలింగ సంపర్కుడని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. పలువురు రాజకీయ నాయకులు, భోపాల్ ప్రజలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. "దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి అలాంటి అనుభవం ఉందా? కానీ, భోపాల్ ప్రజలకు అలాంటి అనుభవం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa