ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆచార్య మూవీ , తండ్రీకొడుకులు తెరపై కనిపించేది ఎంతసేపో తెలుసా...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 01:01 PM

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఫ్యాన్స్ కు భారీ బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ తో చెర్రీ కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ ఈసినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ హాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిస్తుంది. 


ఆర్ ఆర్ ఆర్ విడుదల తో తారక్ టెన్షన్ ఫ్రీ అయినా చెర్రీ మాత్రం టెన్షన్ గానే ఉన్నాడు. ఎందుకంటే... చెర్రీ, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అవనున్నాడు చరణ్. ఇంకా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో అని చెర్రీ ఒకింత నెర్వస్ గా  ఫీల్ అవుతున్నాడట. 


పోతే.. ఆచార్య మూవీ నుండి ఒక న్యూ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన అన్వేష్ రెడ్డి ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో సుమారు 25నిమిషాల పాటు మెగాస్టార్, చరణ్ లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. దీంతో మెగా అభిమానులు చాలా ఎక్సయిటింగ్ గా ఫీలవుతున్నారు. తమ అభిమాన నటులైన మెగా ఫాదర్ అండ్ సన్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై చేసే మ్యాజిక్ ను చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇకపోతే ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లాహే.. లాహే, నీలాంబరి పాటలు ఇంకా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa