టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్ మీదే ఫోకస్ చేసిందని తెలుస్తుంది. పాన్ ఇండియా వెబ్ సిరీస్ లు, హిందీ సినిమాలతో బాలీవుడ్లో బిజీ అవనుంది సామ్. ఈ మేరకు ఆమె పలుమార్లు ముంబై- హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతుంది. ఇంత కష్టమెందుకని ఆలోచించిన సమంత ముంబై లో ఒక ఫ్లాట్ ను అద్దెకు తీసుకుందని సమాచారం. తన కమిట్మెంట్స్ రీత్యా ఇక నుండి ముంబైలోనే గడపనుందట ఈ బ్యూటీ.
ఇకపోతే తాజాగా సమంత జిమ్ లో వర్కౌట్ చేసిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇంటర్నెట్ షేకవుతుంది. ఎటాక్ ఛాలెంజ్ లో భాగంగా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విసిరిన ఛాలెంజ్ ను సమంత స్వీకరించింది. ఈ మేరకు ఒక హార్డ్ ఫుల్ ఎక్సెర్ సైజ్ చేస్తూ వీడియో తీసి జాకీ కి సమాధానమిచ్చింది. అంతేకాక మరో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కు ఎటాక్ ఛాలెంజ్ ను విసిరింది సమంత.
ఈ ఎటాక్ ఛాలెంజ్ ను రకుల్ ప్రీత్ సింగ్ మొదలుపెట్టింది. తను చేసిన బాలీవుడ్ మూవీ ఎటాక్ ప్రచారం కోసం రకుల్ ఈ ఛాలెంజ్ ను క్రియేట్ చేసింది. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో జాన్ అబ్రహం హీరోగా నటించిన సూపర్ హీరో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎటాక్. ఈ సినిమాలో రకుల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 1వ తేదిన విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa