కోల్‌కతా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో జువాల్కర్ పోస్టు చేసిన ఫొటో వారి మధ్య ప్రేమ ఉందని చెప్పడానికి కారణం అవుతోందని చర్చలు సాగుతున్నాయి. ఓ ఫొటోను జువాల్కర్ ఇన్‌స్టాలో ఉంచగా దానికి అయ్యర్.. ‘క్యూట్’ అని కామెంట్ చేశాడు. అందుకు బదులుగా ప్రియాంక.. ‘ఎవరు..నువ్వా?’ అని రిప్లై ఇవ్వడంతో వారి మధ్య ప్రేమ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa