ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పండగకి రానున్న 'తలపతి 66' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 11:34 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 66వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం చేయనున్నారు. ఈ  సినిమాలో హీరోయినిగా రష్మిక మండన్నా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది అని చిత్ర బృందం తెలిపింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa