ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రం : 'దేవేరి' సాంగ్ లిరిక్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 01:37 PM

 


పల్లవి :
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎకడో చేజారి
పాదం నడిచిందే నువు నడిచే దారి
ఎప్పటికప్పుడు నువ్వలా
ఎదురై నవ్వుతూ ఉంటే
అప్పటికప్పుడు గుండెకే
చప్పుడు పెరుగుతూ ఉందే
ఏం చేసినా ఏం చూసినా
నీ ఊహలే నను ముంచెనే
నీకోసమే నిలబడమని
నా ప్రాణమంది వినవే
చరణం : 1
సాగే పయనాన ఎన్ని సంగతులో లెక్కపెట్టగలమా
జారే నిమిషాలే ఆగే మన తీపి గురుతు వలన
పెదవికి నిదుర 
కనులకు పలుకు
చెవులకు చూపు నేర్పినావులే
స్పర్శలు కలిపి
సైగలు చెరిపి
కొత్త భాష రాసావులే
హృదయము కదిపి
కుదురుని కుదిపి
బ్రతుకున జతపడి
స్మృతులతో ముడిపడి
నిలబడమంది నిలకడగా నీతోడై
దేవేరి నా సగమై మారి
బతుకున పొంగిందే
తియ్యని కావేరి
నా దారి నీ జతగా చేరి
తీరం చేరిందే కలలన్నీ తీరి
ఎప్పటికప్పుడు నువ్వలా
పక్కన నవ్వుతూ ఉంటే
ఇంతకు మించిన అందమే
జగతిన నాకు లేదంతే
నీ అలికిడే నీ అలజడే
నా గుండెకే అది సవ్వడే
ఏం జరిగినా నిను విడవని
ఓ ప్రతిన చేసుకుందే


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com