ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా
బ్రతకడమే బరువైనా స్థితి గతులవి ఏవైనా
చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగ ఏ గెలుపూ రాదులే
నింగినంటు ఎవరెస్టైనా
నేల నుండి మొదలౌతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా..
ఉరకలు వేసే కిరణం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన శోకం తుడిచే
వేకువలా ఉదయించాలి వెన్నెలలే కురిపించాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆక్షణం
ఏదీ నీది కాదని అనుకో ఏదో నాటికీ
ఐనా రేపు మిగిలే ఉంది ఆశావాదికీ
కొమ్మలన్ని చుక్కలవైపే
కోరి కోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా..
అందరి బృందావనమే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకారంలా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకారంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగౌతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి