ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉప్పెనంత ఈ ప్రేమకి' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 10:45 AM

ఉప్పెనంత ఈ ప్రేమకి.గుప్పెడంత గుండె ఏమిటో.
చెప్పలేని ఈ హాయికి.భాషే ఎందుకో.
తియ్యనైన ఈ బాధకి.ఉప్పునీరు కంట దేనికో.
రెప్పపాటు దూరానికే.విరహం ఎందుకో.
ఓ.నిన్ను చూసే ఈ కళ్ళకీ.లోకమంత ఇంక ఎందుకో.
రెండు అక్షరాల ప్రేమకీ.ఇన్ని శిక్షలెందుకో.
ఐ లవ్ యు.నా ఊపిరి ఆగిపోయినా.
ఐ లవ్ యు. నా ప్రాణం పోయినా.
ఐ లవ్ యు.నా ఊపిరి ఆగిపోయినా.
ఐ లవ్ యు. నా ప్రాణం పోయినా.
ఉప్పెనంత ఈ ప్రేమకి.గుప్పెడంత గుండె ఏమిటో.
చెప్పలేని ఈ హాయికి.భాషే ఎందుకో.

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు.
సెకనుకోసారైనా చంపేస్తావు.
మంచులా ఉంటావు మంటపెడుతుంటావు.
వెంట పడి నా మనసు మసిచేస్తావు.
తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి.
గుచ్చుకోకు ముల్లుల మరీ గుండెల్లో సరాసరి.

ఐ లవ్ యు.నా ఊపిరి ఆగిపోయినా.
ఐ లవ్ యు. నా ప్రాణం పోయినా.
ఉప్పెనంత ఈ ప్రేమకి.గుప్పెడంత గుండె ఏమిటో.
చెప్పలేని ఈ హాయికి.భాషే ఎందుకో.

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే.
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా.
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే.
తొలకరే లేకుండా పాతెయ్యనా.
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే.
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే.

ఐ లవ్ యు.నా ఊపిరి ఆగిపోయినా.
ఐ లవ్ యు. నా ప్రాణం పోయినా.
ఐ లవ్ యు.నా ఊపిరి ఆగిపోయినా.
ఐ లవ్ యు. నా ప్రాణం పోయినా.

ఉప్పెనంత ఈ ప్రేమకి.గుప్పెడంత గుండె ఏమిటో.
చెప్పలేని ఈ హాయికి.భాషే ఎందుకో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com