ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాన్వీ కపూర్ డైట్ ప్లాన్..

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 12:06 PM

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ అందమైన బాడీ వెనుక చాలా సీక్రేట్సే ఉన్నాయి. అవేంటో తెలుసా? 


 హీరోయిన్ల శరీరం ఎంత నాజుగ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మలు బాడీ వెయిట్ ను మేనేజ్ చేయడానికి, అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పనులు చేస్తారు. అందుకే వీళ్లు మాత్రం అస్సలు బరువు పెరగరు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే జాన్వీ కపూర్ కూడా బాడీ షేప్ ను బాగా ఇష్టపడుతుంది. అసలు ఈ బ్యూటీ అంతటి అందమైన శరీరం కోసం ఎలాంటి డైట్, ఎక్సర్ సైజులు పాటిస్తుందో ఓ లుక్కేద్దాం పదండి. జాన్వీకపూర్ అందానికి వంకపెట్టడానికేమీ లేదు. ఈ బ్యూటీ శరీరం ఎంత అందంగా ఉంటుందో ఆమె ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. బాడీని మెయింటైన్ చేయడానికి జాన్వీ కపూర్ ప్రతిరోజూ 45 నిమిషాల పాటు రన్నింగ్, సైక్లింగ్, డ్యాన్స్ వంటి కార్డియో ఎక్సర్ సైజులు ఖచ్చితంగా చేస్తుందట. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా కార్డియో వ్యాయామాలు చేయడంతో పాటుగా వెయిట్ లిఫ్టింగ్, పుష్ అప్స్, స్క్వాట్స్ వంటి ఇతర శారీరక వ్యాయామాలను కూడా చేస్తుందట. అందుకే ఈ ముద్దుగుమ్మ బరువు పెరగకుండా ఉంటుంది. జాన్వీ కపూర్ గాజు లాంటి అందం వెనకు చాలా సీక్రేట్స్ ఉన్నాయి. ఈ బ్యూటీ ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతుందట. ఇది ఆమెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఆమె శరీరాన్ని హైడ్రేట్ గా కూడా ఉంచుతుంది. జాన్వీ కపూర్ ఉదయం ఏది పడితే అది తినదు. ఈ  హీరోయిన్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, గ్రీన్ టీ, బ్రెడ్ టోస్ట్ ను తీసుకుంటారట. జాన్వీ కపూర్ మధ్యాహ్నం పూట హెల్తీ ఫుడ్ నే తింటుందట. ఈ బ్యూటీ తన మధ్యాహ్న భోజనంలో వేయించిన చికెన్ లేదా చేపలు, రకరకాల కూరగాయలు, బ్రౌన్ రైస్ ఉంటాయట. మంచి ప్రోటీన్ ఫుడ్ ను తినడం వల్లే జాన్వీ కపూర్ అంత హెల్తీగా ఉంది. జాన్వీ కపూర్ స్నాక్స్ లో ఏవి పడితే అవి తినదు. హెల్తీ స్నాక్స్ ను మాత్రమే తింటుంది. జాన్వీ సాయంత్రం స్నాక్స్ లో ఫ్రూట్ స్మూతీలు, బాదం, పిస్తా, జీడిపప్పులు ఖచ్చితంగా ఉంటాయట. జాన్వీ కపూర్ ఎంత రుచిగా ఉన్నా బయటిఫుడ్ మాత్రం అస్సలు తినదట. అలాగే హెల్తీ ఫుడ్ ను మాత్రమే రాత్రిపూట తింటారు. ఈ బ్యూటీ రాత్రిపూట చికెన్ సలాడ్ లేదా గ్రిల్డ్ ఫిష్ ను బాగా ఇష్టంగా తింటారు


 


 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com