రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితురాలు లిషి పరారీలో ఉన్నారు. లిషి ఇంటికి గచ్చిబౌలి పోలీసులు మూడు రోజుల క్రితం నోటీసులు అంటించారు. నోటీసులపై ఆమె సోదరి కుషిత లాయర్‌తో పోలీస్ స్టేషన్‌కు వచ్చి నోటీసులకు రిప్లై ఇచ్చారు. లిషిత ఇంట్లో లేదని, వచ్చాక పంపిస్తామని తెలిపారు. అయితే డ్రగ్స్ కేసులో ఉన్న లిషి కనపడటం లేదంటూ పోలీసులకు కుషిత ఫిర్యాదు చేశారు.