అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో 'టిల్లు స్క్వేర్'తో అలరించేందుకు రెడీ అవుతోంది. దీంతో పాటు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుతో కూడా ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి ‘పరడ’ అనే పేరు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుతో అనుపమ పరమేశ్వరన్ ఓ సినిమాకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఈ సినిమాకు ‘పరడ’ అనే టైటిల్ని పెట్టినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.