శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఢీ లాంటి షోలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు.సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో శ్రద్దా దాస్ ఒకరు. శ్రద్దా దాస్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ తోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ఆ తరహా పాత్రల్లోనే నటిస్తూ కొన్ని విజయవంతమైన చిత్రాలు అందుకుంది. అయితే బలమైన పాత్రలు ఆమెకి దక్కడం లేదు. శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఢీ లాంటి షోలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ప్రభాస్ డార్లింగ్ చిత్రంలో శ్రద్ధా దాస్ కథని మలుపు తిప్పే పాత్రలో నటించింది. ఆ గుంటూరు టాకీస్, డిక్టేటర్, గరుడవేగ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గ్లామర్ తో నటనకి కూడా ప్రాముఖ్యత ఉండే రోల్స్ కోసం శ్రద్ధా దాస్ ప్రయత్నిస్తోంది. తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. శ్రద్దా దాస్ తనదైన శైలిలో గ్లామర్, స్టైల్ మిక్స్ చేస్తూ ఫోజులు ఇచ్చింది.
#ShraddhaDas pic.twitter.com/AqMxv6p9IG
— சினிமா தமிழ் சினிமா (@ctcupdates) March 24, 2024