విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఐశ్వర్య రాజేష్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. స్టైలిష్ బెల్ట్ ఉన్న లాంగ్ గౌన్ లో మెరిసిన ఐశ్వర్య రాజేష్ ఆ ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మన చుట్టూ అందం ఉందని తెలియాలంటే.. మనం గార్డెన్ లో వాకింగ్ చేయాలి అంటూ ఐశ్వర్య రాజేష్ ఈ ఫోటోలకు కామెంట్స్ పెట్టింది. ఐశ్వర్య రాజేష్ ఫోజులకు నెటిజన్లు లైకులతో తమ స్పందన తెలియజేస్తున్నారు. తెలుగులో ఐశ్వర్య రాజేష్.. కౌశల్య కృష్ణ మూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ , మిస్ మ్యాచ్, టక్ జగదీశ్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే. రిపబ్లిక్ తర్వాత ఐశ్వర్య రాజేష్ కి మరో తెలుగు చిత్రంలో అవకాశం రాలేదు. కానీ బోలెడన్ని తమిళ చిత్రాలు చేస్తోంది. గ్లామర్ రోల్స్ కి పూర్తిగా దూరంగా ఉండే ఐశ్యర్య రాజేష్.. తనకి సూట్ అయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది.
#AishwaryaRajesh pic.twitter.com/Zpui4C51QC
— Only Heroines (@OnlyHeroines) March 25, 2024