12 ఏళ్ల సుదీర్ఘ ఆలస్యం తర్వాత విశాల్, సంతానం, అంజలి మరియు వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'మధగజ రాజా' పొంగల్ పండుగ ట్రీట్‌గా జనవరి 12న తమిళనాడు అంతటా సినిమాల్లో విడుదలైంది. సుందర్ సి దర్శకత్వం వహించిన మధగజ రాజా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. థియేట్రికల్ విజయాన్ని అనుసరించి, ఈ చిత్రం జనవరి 31, 2025న తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సమర్పణలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ట్రైలర్ ని రేపు ఉదయం 11:07 గంటలకి టాలీవుడ్ నటుడు వెంకటేష్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కి ప్రముఖ కోలీవుడ్ నటుడు-సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని సంగీతం అందించారు.