by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:38 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మళ్ళీ పాట పాడటం జరిగింది. మాట వినాలి అంటూ నేడు మేకర్స్ సాంగ్ ని రిలీజ్ చేశారు.మరి ఈ సాంగ్ తో మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ మార్క్ ఫోక్ సాంగ్ తో ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. కీరవాణి స్లో మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో అదరగొట్టేశారని చెప్పాలి. అలాగే పెంచల్ దాస్ సాహిత్యంకి పవన్ మార్క్ రిథమ్ తో ఇంపుగా ఉందని చెప్పాలి. అయితే ఇందులో సాంగ్ తో పాటుగా పవన్ లుక్స్ సూపర్బ్ గా ఉన్నాయని చెప్పాలి.దీనితో పాటుగా బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కూడా సాలిడ్ నిర్మాణ విలువలతో కనిపిస్తుండడం విశేషం. ఇలా పాట గానే కాకుండా విజువల్ గా కూడా ఇంప్రెస్ చేసింది. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 28న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.
Latest News