by Suryaa Desk | Fri, Jan 17, 2025, 02:39 PM
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ కంగువ. ఈ మూవీ ఇటీవల విడుదలై థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దేవీశ్రీ ప్రసాద్ కంగువా సినిమా సౌండ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు. ‘‘నేను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్‌ను పరిశీలించే సమయం ఉన్నప్పటికీ.. మనం ఏది చేసినా విమర్శించేవారుంటారు. ‘కంగువా’ ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. అందులోని ‘మణిప్పు..’ పాటపై ప్రశంసలు వచ్చాయి. అలాగే సూర్య అభిమానులు ఎంతోమంది ఇందులోని పాటలను సెలబ్రేట్ చేసుకున్నారు. సూర్య కూడా నాకు ఫోన్ చేసి పాటల గురించి అరగంట మాట్లాడారు. నా వర్క్‌ను ప్రశంసించారు. మేమంతా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. ప్రతి సినిమాలో మంచి చెడులు ఉంటాయి. ‘కంగువా’ కోసం టీమ్ ఎంత కష్టపడిందో దాని విజువల్స్ నుంచి సూర్య నటన వరకూ అన్నిట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరికి ‘కంగువా’ నచ్చకపోయినప్పటికీ మేం ఈ సినిమా విషయంలో గర్వపడుతున్నాం’’ అని చెప్పారు.
Latest News