by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:45 PM
వైష్ణవి చైతన్య.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న అచ్చమైన తెలుగమ్మాయి. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సినీరంగంలో కథానాయికగా మెప్పిస్తుంది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా భారీ విజయాన్ని అందుకుంది.బేబీ సినిమాతో విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న జాక్ మూవీలో నటిస్తుంది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వైష్ణవి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో కొత్తగా మరో మూడు సినిమాలకు ఈ బ్యూటీ సైన్ చేశారని సమచారం.సినిమాల్లోనే కాదు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.పర్పుల్ కలర్ డిజైనర్ చీరలో వైష్ణవి దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.