by Suryaa Desk | Thu, Jan 16, 2025, 07:42 PM
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో మూడో రోజు సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టిందో చూస్తే. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు లెక్క కట్టారు.గోదారి గట్టు మీద రామ చిలక సహా బీమ్స్ అందించిన ఇతర పాటలు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 1300 స్క్రీన్లలో సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశారు. అంచనాలకు తగినట్లుగానే తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక తొలిరోజు వసూళ్లుగా నిలిచింది.
పండగపూట ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన విందు భోజనం లాంటి ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఆ కేటగిరీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. రెండో రోజూ కూడా అదే రేంజ్‌లో రెస్పాన్స్ రాగా.. స్వల్పంగా కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఏకంగా రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో సంక్రాంతి వస్తున్నాం సినిమాకు రూ.77 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. ఈ వీకెండ్ నాటికే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫినిష్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక సంక్రాంతికి వస్తున్నాం మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగ ముగియడంతో నగరవాసి పల్లె నుంచి తిరిగి పట్నానికి బయల్దేరాడు. దీంతో గురువారం నుంచి మల్టీప్లెక్స్‌లు కళకళలాడతాయని భావిస్తున్నారు. పండుగ సెలవులతో పాటు వీకెండ్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాంకు రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లు లభిస్తాయని భావిస్తున్నారు. మరి చూద్దాం వెంకీ మామ ఎలాంటి మేజిక్ చేస్తాడో?