by Suryaa Desk | Thu, Jan 16, 2025, 03:31 PM
టాలీవుడ్ నటుడు సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి 'సంబరాల ఏటిగట్టు' అనే టైటిల్ ని లాక్ చేసారు. తేజ్ కొత్త లుక్‌తో ఈ సినిమా కోసం పూర్తి రూపాంతరం చెందాడు. ఈ చిత్రంలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో నటి వసంత పాత్రలో నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ సంబరాల ఏటిగట్టు (SYG) యొక్క 'కార్నేజ్' టీజర్‌ను లాంచ్ చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఎడిటర్ నవీన్ విజయకృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎడిటర్ గా నవీన్ విజయకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ గా అయేషా మరియమ్ ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రంలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సిఎంమని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Latest News